: క్రికెట్ మైదానంలో పిడుగుపడి ఆరుగురి మృతి


క్రికెట్ మైదానంలో పిడుగుపడి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఒడిశాలోని కుర్దా జిల్లాలోని జరిపాద గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని యువకులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడింది. పిడుగు ధాటికి ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని కుర్దాలోని తంగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని భువనేశ్వర్ తరలించారు. కాగా, యువకుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News