: రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లోకి వెళుతుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, తనను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు కానీ, ఆసెంబ్లీ ఆవరణ నుంచి కాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆయన మాట వినకపోవడంతో "లిఖితపూర్వక ఆదేశాలిస్తే అసెంబ్లీ ఆవరణలో అడుగుపెట్టను" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.