: ఓయూలో తెలంగాణ ఉద్యమం నాటి సీన్ రిపీట్


హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో తెలంగాణ ఉద్యమ సమయంనాటి సీన్ రిపీట్ అయింది. యూనివర్శిటీ విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. ఉద్యోగాల భర్తీకి టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రకటన ఇవ్వాలని, పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై కొందరు విద్యార్థులు రాళ్లు కూడా విసిరారు. పోలీసులు కూడా గట్టిగానే స్పందించడంతో, ఉద్రిక్తత తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ, ఉద్యమం నాటి పరిస్థితులు యూనివర్శిటీలో రిపీట్ కావడం ఆందోళనకరమే.

  • Loading...

More Telugu News