: నన్ అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించిన మమతా బెనర్జీ


పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాలోని ఓ స్కూల్ లోపలికి చొరబడి క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం చేసి, నగదు దోచుకెళ్లిన ఘటన సంచలనం కలిగించింది. ఆ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, సున్నితమైన కేసు కావడంతో సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని అన్నారు. కాగా, నన్ పై అత్యాచారం ఘటనపై బెంగాల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన సీఎంను ఆందోళనకారులు ఘొరావ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News