: మీ ఇద్దరు లేని జట్టును ఊహించుకోవడం కష్టం: సచిన్


శ్రీలంక క్రికెట్ దిగ్గజాలైన కుమార సంగక్కర, మహేల జయవర్ధనేల రిటైర్మెంట్ పై ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంకకు ఎన్నో ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నారని సచిన్ కొనియాడాడు. వారిద్దరూ లేని శ్రీలంక క్రికెట్ వన్డే జట్టును ఊహించుకోవడం చాలా కష్టమని ఫేస్ బుక్ లో అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ కు జయవర్ధనే, వన్డేలకు సంగక్కర గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరిద్దరికీ సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు. రంగుల దుస్తుల్లో మీరిద్దరూ ఇన్నింగ్స్ ను నిర్మించే అద్భుతాన్ని చూసే అవకాశాన్ని ఇకపై కోల్పోతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News