: ఈ నెల 22న రామానాయుడి సంస్మరణ సభ... హాజరుకానున్న సినీ దిగ్గజాలు
ఇటీవలే దివంగతులైన ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడి సంస్మరణ సభను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు, బంజారాహిల్స్ లో ఉన్న పార్క్ హయత్ హోటల్ లో నిర్వహిస్తున్నట్టు ఎంపీ, నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, రచయితలు సంస్మరణ సభలో పాల్గొంటారని సుబ్బరామిరెడ్డి తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జయప్రద, జయసుధ, జమున, అల్లు అరవింద్, మురళీమోహన్, సత్యనారాయణ, డా.రాజశేఖర్, జీవిత, పరుచూరి సోదరులు, జగపతి బాబు, కోట శ్రీనివాసరావు తదితరులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి టి.సుబ్బరామిరెడ్డే అధ్యక్షత వహించనున్నారు.