: చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఆ నోటీసు అందజేసింది. తమ ఎమ్మెల్యేలను అగౌరవపరిచేలా సీఎం మాట్లాడారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు, ఏపీ అసెంబ్లీలో ఈరోజు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తరువాత సభను స్పీకర్ కోడెల శివప్రసాద్ రేపటికి వాయిదావేశారు.