: కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది: డీకే అరుణ
కేసీఆర్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆమె మండిపడ్డారు. కోర్టులో నడుస్తున్న మైనింగ్ కేసు అంశాన్ని... సభలో లేవనెత్తడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేస్తున్నారని... అందులో భాగంగానే అసెంబ్లీలో తనను మాట్లాడనీయకుండా, మైకును కూడా కట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని సూచించారు.