: నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా... స్మృతి ఇరానీని గౌరవిస్తా: శరద్ యాదవ్
దక్షిణ భారత మహిళల చర్మం రంగుపై గతవారం పార్లమెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీ(యు) అధినేత శరద్ యాదవ్ తాజాగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని తెలిపారు. రాజ్యసభలో ఈరోజు శరద్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, యాదవ్ వ్యాఖ్యలు మీడియాలో చాలా అనుచిత ముద్రను వేశాయని, వెంటనే ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. ఇందుకు శరద్ యాదవ్ సమాధానమిస్తూ, "ఆ వివాదం పట్ల నేనూ చింతిస్తున్నా. అంతేగాక ఆమె పట్ల (మంత్రి స్మృతి ఇరానీ) నాకు గౌరవం ఉంది" అని తెలిపారు.