: టెన్త్ ప్రశ్నా పత్రాలు దొంగిలించిన జగన్... మాకెలా పాఠాలు చెబుతారంటూ కాల్వ ఫైర్


ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం విరుచుకుపడింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీని చదివి వినిపిస్తున్న సందర్భంగా ''ఇంగ్లిష్ రాకపోతే రండి... నేర్పుతాను’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. టెన్త్ ప్రశ్న పత్రాలను దొంగిలించిన మీరా, మాకు పాఠాలు చెప్పేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘1980 దశకంలో హైదరాబాదులోని శివ శివానీ పాఠశాలలో టెన్త్ పత్రాలు తస్కరణకు గురయ్యాయి. వాటిని దొంగిలించిన విద్యార్థి ఎవరని ఆరా తీస్తే, సదరు విద్యార్థి జగన్ అని తేలింది. ప్రశ్నపత్రాలు దొంగిలించిన మీరా మాకు పాఠాలు చెప్పేది?’’ అంటూ కాల్వ వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News