: శ్రీవారి సేవలో సినీ గాయకులు
తిరుమల శ్రీవారి సేవలో సినీ గాయకులు అంజనా సౌమ్య, శ్రీకృష్ణ, కృష్ణ చైతన్య తరించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఈ ముగ్గురు గాయకులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత తిరుమలలో జరిగిన అన్నమయ్య వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడి టీటీడీ వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. వెంటనే గవర్నర్ హైదరాబాదు బయలుదేరి వెళ్లారు. నిన్ననే తిరుమల వచ్చిన గవర్నర్ నేడు తాళ్లపాక అన్నమాచార్య 512వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.