: గుంటూరులో హైదరాబాదు విద్యార్థిని మృతదేహం... ఘటనపై పలు అనుమానాలు
హైదరాబాదులోని చంపాపేటకు చెందిన బీటెక్ విద్యార్థిని అనూషా రెడ్డి గుంటూరు జిల్లాలో శవమై తేలింది. నేటి ఉదయం గుంటూరు జిల్లాలోని సాగర్ కాలువ వంతెన సమీపంలో విగతజీవిగా కనిపించిన అనూషా రెడ్డి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనూషా రెడ్డిది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే ఘటన జరిగిన తీరుపై పోలీసులు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు.