: నిప్పులు కక్కుతున్న డేల్ స్టెయిన్ బంతులు... దిల్షాన్ డకౌట్


క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సఫారీ బౌలర్లు చెలరేగారు. రెండో ఓవర్ లోనే లంక ఓపెనర్ ను ఔట్ చేసిన సఫారీలు, ఐదో ఓవర్ లో మరో వికెట్ పడగొట్టారు. సఫారీ స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్ తన పదునైన బంతులతో లంక బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తిస్తున్నాడు. స్టెయిన్ విసిరిన బంతి లంక ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్ మన్ తిలకరత్నే దిల్షాన్ ను డకౌట్ చేసింది. మూడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక మరో పరుగులు మాత్రమే సాధించి జట్టు స్కోరు 4 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరడంతో లంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర(1) క్రీజులోకొచ్చాడు. సంగక్కరతో జతకలిసిన తిరిమన్నే(20) స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి లంకేయులు 27 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News