: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక... రెండో ఓవర్ లోనే తొలి వికెట్ డౌన్


ప్రపంచ కప్ లో తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంకేయులకు సఫారీ బౌలర్లు షాకిచ్చారు. రెండో ఓవర్ లోనే తొలి వికెట్ కూల్చి, లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను పెవిలియన్ చేర్చారు. దీంతో కంగుతిన్న శ్రీలంక జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తోంది. వికెట్ పడ్డ తర్వాత ఆచితూచి ఆడుతున్న నేపథ్యంలో తర్వాతి ఓవర్ లో పరుగులేమీ రాబట్టలేకపోయింది. నాలుగు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News