: సౌత్ ఇండియా క్వీన్ గా తెలంగాణ యువతి.... రన్నరప్ గా కర్ణాటక అమ్మాయి!


కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియా క్వీన్ పోటీల్లో తెలంగాణకు చెందిన యువతి ఐశ్వర్య బాస్ పూరే కిరీటం దక్కించుకున్నారు. సౌత్ ఇండియా క్వీన్ కిరీటం కోసం దక్షిణాది ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు పోటీ పడగా, ఐశ్వర్య విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకున్నారు. కర్ణాటక అమ్మాయి సీమా తొలి రన్నరప్ గా నిలవగా, తమిళనాడుకు చెందిన దివ్యశ్రీ రెండో రన్నరప్ గా నిలిచింది. ఆదివారం రాత్రి బెంగళూరులో ముగిసిన ఫైనల్స్ లో అందంతోనే కాక హావభావాలతోనూ న్యాయనిర్ణేతలను మంత్రముగ్ధులను చేసిన ఐశ్వర్య, సౌత్ ఇండియా క్వీన్ కిరీటాన్ని ఎగురవేసుకుపోయారు. ఏపీ నుంచి ఈ టైటిల్ కోసం బరిలోకి దిగిన నలుగురు అమ్మాయిలు తొలి మూడు స్థానాలకు చేరుకోలేకపోయారు.

  • Loading...

More Telugu News