: భూ వివాదంలో మాజీ డీజీపీ... కీసరలో నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు


ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన అరవిందరావు భూ వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట మండలంలో వెలుగుచూసిన ఈ వివాదం పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కింది. కీసరలోని ఓ స్థలాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నుంచి కొనుగోలు చేశానని చెబుతున్న మాజీ డీజీపీ అరవిందరావు అందులో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధపడ్డారు. అయితే సదరు భూమి గ్రామంలోని ఆలయానికి చెందినదని సర్పంచ్ తో పాటు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన అరవిందరావు, తాను కొనుగోలు చేసిన సందర్భంగా చేయించుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలను అక్కడి పోలీస్ స్టేషన్ కు పంపడంతో పాటు గ్రామస్థులపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీసులు తికమకపడుతున్నారు.

  • Loading...

More Telugu News