: బీజేపీలో చేరేందుకు సిద్ధమైన నేదురుమల్లి తనయుడు


మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి కాషాయదళంలో చేేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో పార్టీలో చేరే విషయమై చర్చించారట. దీనికి, వెంకయ్యనాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 22న వెంకయ్య సమక్షంలోనే రామ్ కుమార్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. రామ్ కుమార్ కాంగ్రెస్ ను వీడనుండడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

  • Loading...

More Telugu News