: జిహాదీ జాన్ 'గబ్బర్ సింగ్'లా భయపెడతాడట!


ఐఎస్ఐఎస్ తీవ్రవాది జిహాదీ జాన్ గుర్తున్నాడా? ఐఎస్ఐఎస్ విడుదల చేసిన వీడియోల్లో ఎంతో మంది అమాయక బందీల కుత్తుకలు కత్తిరించిన కరడుగట్టిన మిలిటెంటే ఈ జిహాదీ జాన్. ఈ నరరూపరాక్షసుడు అచ్చం 'షోలే' సినిమాలోని గబ్బర్ సింగ్ లా ప్రవర్తిస్తాడట. అదెలా తెలిసిందంటే.... ఐఎస్ఐఎస్ చెరనుంచి విడుదలైన స్పానిష్ జర్నలిస్టు జేవియర్ ఎస్పినోవా కొన్ని వివరాలు తెలిపాడు. జేవియర్ ను ఐఎస్ఐఎస్ బందీగా పట్టుకున్న అనంతరం ఓ చెరసాలలో ఉంచిందట. అతని గదిలో ప్రవేశించిన జాన్ వెండి పిడి గల పెద్ద కత్తితో జేవియర్ మెడపై గీస్తూ 'ఎలా ఉంది చల్లగా ఉంది కదా? ఇది నీ మెడను కోస్తే ఎలా ఉంటుందో ఊహించగలవా?' అని ప్రశ్నించాడట. 'ఊహించనంత బాధకలుగుతుంది' అంటూ ఆ కత్తిని తీసి అతని అనుచరుడికి ఇచ్చాడట. తరువాత పిస్టల్ తీసి జేవియర్ తలకు గురిపెట్టి మూడుసార్లు పేల్చాడట. అందులో బుల్లెట్లు లేకపోవడంతో జేవియర్ కు ఏమీ కాలేదు. తరువాత స్పానిష్ ప్రభుత్వం, ఐఎస్ఐఎస్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జేవియర్ ను విడిచిపెట్టారు. ఆరు నెలలపాటు తాను అనుభవించిన నరకాన్ని ఆయన మీడియాకు వివరించారు. కాగా, జిహాదీ జాన్ గురించి ఇటీవలే మీడియా ద్వారా పలు విషయాలు వెల్లడయ్యాయి. బీఎస్సీ ఆనర్స్ చదివిని జాన్ కువైట్ లో ఉద్యోగిగా చేరాడు. అక్కడ మంచి పనిమంతుడిగా పేరుతెచ్చుకున్నాడు. తరువాత ఐఎస్ఐఎస్ లో చేరి, అమాయకులను బంధించి గొంతులు కోస్తున్నాడు.

  • Loading...

More Telugu News