: కేంద్రంపై మోదీ సోదరుడి మాటల దాడి... ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారని విమర్శ!


కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్న సోదరుడు ప్రహ్లాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి కరవైందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన 'ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ ఫెడరేషన్' కార్యక్రమంలో దానికి ఉపాధ్యక్షుడైన ప్రహ్లాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాలని మీరు (ప్రజలు) కష్టపడ్డారు. కానీ, ఇప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే, ఇదంతా ఎన్ డీఏ ప్రభుత్వ వైఫల్యమని నేననుకుంటున్నా" అని మోదీ సోదరుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో మోదీ గురించి ప్రస్తావిస్తూ, "నేను చేస్తున్న వ్యతిరేకత ఒక సోదరుడిపై మరో సోదరుడు చేస్తుంది కాదు. నా సోదరుడు చాలా విలువైన వ్యక్తి. తనని గౌరవిస్తా. కానీ నేనో వృత్తిలో ఉన్నాను కాబట్టి, ఈ ప్లాట్ ఫామ్ కు వచ్చి సోదరుడి ముందు నా గొంతు విప్పుతున్నా" అని ప్రహ్లాద్ వివరించారు. కాగా, దేశంలో అవినీతి అంశంపై మాట్లాడిన ఆయన, అవినీతిపై పోరాడతామన్న సందేశంతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పుడా అంశాన్ని వీధుల్లోకి తీసుకురావాల్సిన అవసరమొచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News