: శరద్ యాదవ్ వ్యాఖ్యలను సమర్ధించిన ఆయన కుమార్తె
పార్లమెంటులో బీమా బిల్లు సందర్భంగా దక్షిణ భారత మహిళల చర్మం రంగుపై వ్యాఖ్యానించి జనతాదళ్ యునైటెడ్ అధినేత శరద్ యాదవ్ వివాదాన్ని రేపిన సంగతి విదితమే. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని పలువురి నుంచి డిమాండ్ లు వచ్చినప్పటికీ... తన మాటలకు కట్టుబడి ఉన్నానని శరద్ చెప్పారు. తాజాగా ఆ వ్యాఖ్యలను ఆయన కుమార్తె సుహాసిని బుందేలా సమర్ధిస్తున్నారు. తన తండ్రి తప్పేమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పరని, అసలు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మీడియాతో అన్నారు.