: శైలజానాథ్ నుంచి ప్రాణహాని ఉంది: మంజునాథనాయుడు


మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మంజునాథనాయుడు అనే వ్యక్తి ఆరోపించారు. శైలజానాథ్ అక్రమాస్తులపై ఏసీబీ, సీబీఐలకు ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన అనంతపురంలో మాట్లాడుతూ, శైలజానాథ్ అనంతపురం, బెంగళూరు, హైదరాబాదులో భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వాధికారుల సహకారంతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. తమ భూవివాదం హైకోర్టులో ఉండగానే, హోదా అడ్డం పెట్టుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన చెప్పారు. శైలజానాథ్ నుంచి ప్రాణహాని ఉండడంతో రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News