: హీరో అజిత్ కు శస్త్రచికిత్స
తమిళనాడులో విశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. తాజా చిత్రం 'యెన్నై అరిందాల్' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సూపర్ స్టార్ గత కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో, మంగళవారం అజిత్ కు శస్త్రచికిత్స (సెప్టోప్లాస్టీ-ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ) నిర్వహించారు. ప్రముఖ ఇ.ఎన్.టి నిపుణుడు డాక్టర్ ఎంకే రాజా ఆయనకు సర్జరీ చేశారు. ప్రస్తుతం అజిత్ కోలుకుంటున్నాడని ఆయన ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అజిత్ ఇటీవలే రెండో బిడ్డకు తండ్రయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య షాలిని ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. అంతకుముందు వారికో పాప ఉంది. నటుడు కాకముందు అజిత్ బైక్ రేసర్ గా ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. ఆ రేసుల్లో అయిన గాయాలు, వెన్నెముకకు జరిగిన శస్త్రచికిత్సలు చాలా రోజుల పాటు అజిత్ ను మంచానికే పరిమితం చేశాయి.