: పాకిస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ... క్వార్టర్స్ కు దూరమైన 'ఏడడుగుల బులెట్'!
తన ఎత్తును చూపి ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెట్టే పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఆస్ట్రేలియాతో జరిగే కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆడడం లేదు. పొత్తి కడుపులో నొప్పి కారణంగా తదుపరి మ్యాచ్ కి ఇర్ఫాన్ దూరంగా ఉంటాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తును ఇర్ఫాన్ ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత పొడగరిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాను ఆడిన 5 లీగ్ మ్యాచ్ లలో ఇర్ఫాన్ ఎనిమిది వికెట్లు తీశాడు. ఇర్ఫాన్ ఆందుబాటులో లేకపోవడంపై పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్ పోరులో గెలిస్తే, సెమీఫైనల్ నాటికి అతను అందుబాటులో ఉంటాడని తెలిపింది.