: 'క్యూ' దర్శకుడికి 'గొల్లపూడి శ్రీనివాస్' అవార్డు


'గొల్లపూడి శ్రీనివాస్' పేరుతో ప్రతి ఏటా ఉత్తమ నూతన దర్శకుడికి ఇచ్చే పురస్కారానికి సంజీవ్ గుప్తా అనే దర్శకుడు ఎంపికయ్యారు. హిందీలో ఆయన రూపొందించిన 'క్యూ' చిత్రానికిగానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుకోసం వచ్చిన వివిధ భాషలకు చెందిన 27 సినిమాలను అవార్డు జ్యూరీ సభ్యులు సినీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, ఎన్ ఎం వసంత్, నటి రోహిణి పరిశీలించారు. వాటిలో 'క్యూ' దర్శకుడిని ఎంపిక చేసినట్టు చెన్నైలో మీడియాకు సింగీతం తెలిపారు. ఆగస్టు 12న గొల్లపూడి శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా పురస్కారాన్ని అందజేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News