: నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్యే కోటాలో టికెట్ దక్కించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కొద్దిసేపటి కిందట నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి చెందిన వీవీవీ చౌదరి, తిప్పేస్వామి, సంధ్యారాణిలు నామినేషన్ వేశారు. అటు, ఇప్పటికే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు. వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావిస్తున్నారు. నామినేషన్ దాఖలుకు నేడు చివరిరోజు. వారందరికీ పోటీగా ఎవరూ బరిలో నిలిచే అవకాశం లేదు.