: రాజమండ్రిలో నకిలీ నోట్ల కలకలం... రూ.8.37 లక్షల విలువైన ఫేక్ కరెన్సీ స్వాధీనం
నకీలీ నోట్ల చెలామణి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్నటిదాకా హైదరాబాదు, తెలంగాణ జిల్లాలు, విజయవాడ, గుంటూరులకే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా కోస్తాంధ్రకూ పాకింది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన నగరం రాజమండ్రిలో నేటి ఉదయం నకిలీ నోట్ల కలకలం రేగింది. నగరంలో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వారు నకిలీ నోట్లను చెలామణి చేసినట్లు తేలింది. దీంతో వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు రూ.8.37 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.