: భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా పాకిస్థానీ!


క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. ఈ రెండు దేశాల జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు భారత్, పాకిస్థాన్ లలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. తాజా వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను కోట్లాది మంది వీక్షించారు. అయితే వీటి మధ్య మరో మ్యాచ్ జరిగే అవకాశాలు అంతగా లేవనే చెప్పాలి. అయితే భారత్ జట్టు పాల్గొనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓ పాకిస్థానీ పాల్గొంటున్నాడు. జట్టులో ఆటగాడిగా కాదులెండి. మైదానంలో అంపైర్ గా! ఇప్పటికే లీగ్ దశ దాటిన మెగా టోర్నీలో రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లకు తెర లేస్తోంది. మొత్తం నాలుగు మ్యాచ్ లకు సంబంధించి ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది. శనివారం ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లో బంగ్లాదేశ్ తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే మెల్ బోర్న్ చేరుకున్నాయి. ఈ మ్యాచ్ కు అంపైర్లుగా వ్యవహరించే వారిని కూడా ఐసీసీ ఖరారు చేసింది. ఇద్దరు అంపైర్లలో ఇయాన్ గౌల్డ్ ఇంగ్లండ్ కు చెందిన వారు కాగా, అలీమ్ దార్ పాక్ జాతీయుడు. అంపైరింగ్ లో విశేష అనుభవం ఉన్న అలీమ్ దార్, భారత్ ఆడే మ్యాచ్ కు అంపైర్ గా ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News