: ఏఏఏ జీవితకాల అధ్యక్షుడిగా సురేష్ కల్మాడీ
2010 కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి, మళ్లీ బయటికొచ్చిన భారత క్రీడల నిర్వాహకుడు సురేష్ కల్మాడీకి అరుదైన అవకాశం దక్కింది. 'ఆసియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్' (ఏఏఏ) జీవితకాల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నెల 12న జకార్తాలో జరిగిన ఏఏఏ 80వ మండలి సమావేశంలో ఈ గౌరవప్రదమైన పదవికి ఆయనను నియమించారు. అసోసియేషన్ ఏర్పాటైన 2000 సంవత్సరం నుంచి ఆసియా ఖండంలో క్రీడల అభివృద్ధికోసం తీవ్ర కృషి చేసినందుకుగానూ కల్మాడీకి ఈ అవకాశం లభించింది. గతంలో కల్మాడీ ఏఏఏ అధ్యక్షుడిగా పనిచేసి తరువాత రాజీనామా చేశారు.