: ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం... కృష్ణా జిల్లా లింగాలలో ఘటన


కృష్ణా జిల్లాలో ఇండియన్ బ్యాంకు ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. జిల్లాలోని మండపల్లి మండలం లింగాలలో నేటి ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. ఏటీఎంలో చోరీకి వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఏటీఎం మిషన్ ను పగులగొట్టారు. అయినా వారి పాచిక పారకపోవడంతో ఒట్టి చేతులతోనే వెనుదిరిగారు. దుండగుల దాడిలో ఏటీఎం మిషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News