: ధోనీ ఉన్నాడుగా... తప్పక గెలుస్తారు: యువీ
ధోనీ నాయకత్వంపై డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నాడు. గ్వాలియర్ లోని ఐటీఎమ్ యూనివర్శిటీలో ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా యువీ మాట్లాడుతూ, అగ్రశ్రేణి జట్లపై ధోనీ వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయని కితాబిచ్చాడు. ఇక, పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ ను ఎదుర్కొన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. అతని బంతుల వేగం గంటలకు 150 కిలోమీటర్లకు పైగా ఉండేదని, నిజంగా అదో సవాలని పేర్కొన్నాడు. అక్తర్ ఇప్పుడు చక్కగా కామెంటరీ చెబుతున్నాడని ప్రశంసించాడు.