: మంత్రి జగదీశ్ రెడ్డిపై లోకాయుక్తలో మాజీ ఎంపీ పొన్నం ఫిర్యాదు
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై లోకాయుక్తలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర అవినీతి జరిగిందని, చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. వెంటనే స్పందించిన లోకాయుక్త, ఏడుగురు ప్రభుత్వ సెక్రెటరీలకు నోటీసులు పంపింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎడ్యుకేషన్, 'ఫాస్ట్' కమిటీ మెంబర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్, ఉన్నత విద్యాశాఖ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ పీఅండ్ఆర్ డీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ జీఏడీ, లా సెక్రెటరీలకు నోటీసులు అందాయి. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే మంత్రికి కూడా నోటీసులు పంపుతామని పేర్కొంది.