: అవినీతి మీ ట్రాక్ రికార్డయితే... నీతి నా ట్రాక్ రికార్డ్: నిప్పులు చెరిగిన చంద్రబాబు
ఈ రోజు శాసనసభలో ప్రతిపక్షంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంలా మార్చిన మీరా మాట్లాడేదంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు తప్పకుండా రావాలని... టీడీపీ, ఎన్డీయేలు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాయని చెప్పారు. అవినీతి అనేది ప్రతిపక్షం ట్రాక్ రికార్డయితే... తమ ట్రాక్ రికార్డ్ నీతి అని అన్నారు. జలయజ్ఞాన్ని మరోసారి ధనయజ్ఞంలా మారనివ్వమని తెలిపారు. రాయలసీమకు నీళ్లిస్తే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉభయగోదావరి జిల్లాలకు నీటి సమస్య తలెత్తుతుందనే అపోహలను సృష్టిస్తున్నారని... తమకు అత్యంత బలమైన ఈ రెండు జిల్లాలకు అన్యాయం జరగనివ్వమని చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే మళ్లిస్తామని స్పష్టం చేశారు.