: ఇప్పుడు ఫ్రెష్ గా, ఫిట్ గా ఉన్నాను: కేజ్రీవాల్
పదిరోజుల తరువాత బెంగళూరు నుంచి ఢిల్లీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో స్పందించిన ఆయన, చాలా ఫ్రెష్ గా, ఫిట్ గా ఉన్నానని చెప్పారు. అంతేగాదు, మళ్లీ వర్క్ లో పాల్గొనేందుకు తిరిగి వస్తున్నందుకు ఎక్సైటింగ్ గా ఉందన్నారు. "దగ్గు పోయింది, షుగర్ నియంత్రణలో ఉంది. ఇప్పుడు చాలా ఫ్రెష్ గా, ఫిట్ గా ఉన్నా. అదే సమయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని కేజ్రీ ట్వీట్ చేశారు. తనకు చికిత్స చేసిన జిందాల్ నేచర్ క్యూర్ ఇన్ స్టిట్యూట్ డాక్టర్లు, ఇతరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలం నుంచి తీవ్ర దగ్గు, మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీ నేచురోపతి చికిత్స కోసం ఈ నెల 5న బెంగళూరు వెళ్లడం తెలిసిందే.