: గాలి, పయ్యావులకు నిరాశే... ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొలిక్కి వచ్చిన చంద్రబాబు కసరత్తు
శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల ఖరారుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. మొత్తం మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా, బీదా రవిచంద్ర, వీవీవీ చౌదరి పేర్లను ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మూడో అభ్యర్థిపై చంద్రబాబు మరికాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తమకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందిలే అంటూ ధీమాగా ఉన్న పార్టీ సీనియర్లు గాలి ముద్దు కృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్ లకు చంద్రబాబు నిర్ణయంతో నిరాశే మిగిలింది. అన్ని మార్గాల్లో యత్నించినా వారు సఫలం కాలేకపోయారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.