: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిల్లి సుభాష్ నామినేషన్... టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ


ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఇక ఒక్కరోజు మిగిలింది. ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నుంచి టికెట్ కోసం పలువురు యత్నించినా, పిల్లి సుభాష్ అభ్యర్థిత్వానికే అధినేత జగన్ ఆమోదం తెలిపారు. ఇక టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్కంఠ వీడలేదు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్నా, ఇప్పటిదాకా అభ్యర్థి ఖరారు కాలేదు. పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు చంద్రబాబు ముందు క్యూ కడుతున్నారు. నేటి సాయంత్రానికి గాని అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళకే చంద్రబాబు టికెట్ కేటాయిస్తారన్న ప్రచారమూ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News