: వేలంలో నంద్యాల కూరగాయల మార్కెట్... రోడ్డుపై బైఠాయించిన ఎంపీ ఎస్పీవై రెడ్డి


కర్నూలు జిల్లా నంద్యాల కూరగాయల మార్కెట్ వేలానికి వచ్చింది. పన్నులు చెల్లించడం లేదంటూ మునిసిపల్ అధికారులు మార్కెట్ స్థలాన్ని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక ఎంపీ ఎస్పీవై రెడ్డి వేలం కుదరదని తేల్చిచెప్పారు. అయినా ఆయన మాటను పక్కనబెట్టిన అధికారులు వేలం ఏర్పాట్లలో మునిగిపోయారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం గేటు ముందు రోడ్డుపైనే బైఠాయించారు. పదిహేనేళ్లుగా క్రమం తప్పకుండా పన్నులు కడుతున్నా, మార్కెట్ ను వేలం వేయడమేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News