: జగన్ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పొచ్చుగా?... మహిళా మంత్రికి కోడెల సూచన
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ రంగంలో అవకతవకలపై చర్చ జరుగుతున్న వేళ విపక్షం ప్రశ్నలకు... ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. జియో ట్యాగింగ్ విధానంపై మంత్రి కిమిడి మృణాళిని ఇచ్చిన జవాబుపై విపక్ష నేత వివరణ కోరడంతో ఆమె సూటిగా సమాధానం చెప్పలేక పోయారు. ఆ వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జోక్యం చేసుకుని వైఎస్ జగన్ పై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విపక్షం విమర్శలు చేసింది. దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా మంత్రి సూటిగా సమాధానం చెప్తే బాగుంటుందని అన్నారు. ఈ విషయంలో సూటిగా సమాధానం చెప్పకుండానే ప్రభుత్వం తప్పించుకోవడం గమనార్హం.