: జానారెడ్డి చాంబర్ ముందు గలాటా... మంత్రి హరీశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ మధ్య వాగ్వాదం


తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పై మంత్రి హరీశ్ రావు తీవ్ర పదజాలంతో దాడి చేశారు. సభలో తాము చెప్పినట్లు వినకపోతే, ఇబ్బందుల్లో పడతావంటూ హరీశ్, పువ్వాడను హెచ్చరించారు. సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హరీశ్ రావును అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇరువురు నేతలు సభ వెలుపల, అసెంబ్లీ ప్రాంగణంలోని ప్రతిపక్ష నేత జానారెడ్డి చాంబర్ ముందు వాదులాడుకున్నారు. హరీశ్ బెదిరింపులకు ఘాటుగానే సమాధానం చెప్పిన పువ్వాడ, తన డిమాండ్ ను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 'ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ ఆయన హరీశ్ కు ఎదురొడ్డారు. దీంతో అక్కడ కలకలం రేగింది.

  • Loading...

More Telugu News