: ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో... ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్య


ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో, ఇద్దరు కన్న బిడ్డలను బావిలో పడేసి తను కూడా దూకింది. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. రేగిడి మండలం లింగాల వలసలో రాణి అనే ఓ మహిళ ఇద్దరు పిల్లలు సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో పిల్లలు నిఖిత, రేష్మలు కూడా మృతి చెందారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News