: గ్రామీణ కేబుల్ టీవీ కంట్రోల్ రూంపై దాడి... గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తుల వీరంగం
చెన్నైలోని ఓ టీవీ చానెల్ కార్యాలయంపై ఇటీవలి దుండగుల దాడిని మరువకముందే అదే తరహా దాడి ఏపీలో కూడా చోటుచేసుకుంది. నిన్న రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామీణ కేబుల్ టీవీ కంట్రోల్ రూంపై దాడికి దిగారు. దుండగుల దాడిలో కంట్రోల్ రూంలోని కంప్యూటర్లు, రిసీవర్లు, కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై ఛానెల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని ఎస్ఎస్ఎం కళాశాల సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడికి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.