: ఆట మీద శ్రద్ధ పెట్టండి...డివిలీర్స్ పని పట్టండి: శ్రీలంక ప్రధాని హెచ్చరిక
వన్డే వరల్డ్ కప్ లో లీగ్ దశ ముగిసి నాకౌట్ కు చేరుకుంది. దీంతో అసలు పోరు ఎవరి మధ్య అనే దానిపై ఓ చిన్న స్పష్టత వచ్చింది. మరో మూడడుగుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు టైటిల్ విజేతగా అవతరించనుంది. దీంతో వరల్డ్ కప్ పై చిన్నా పెద్దా అంతా ఆసక్తి చూపుతున్నారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే తమ ఆటగాళ్లను హెచ్చరించారు. మార్చి 18న సిడ్నీలో జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. దక్షిణాఫ్రికా జట్టు బలహీనతలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్ పని తొందరగా పట్టాలని ఆయన సూచించారు. సౌతాఫ్రికాను చిత్తు చేయగల సామర్థ్యం శ్రీలంకకు ఉందని ఆయన పేర్కొన్నారు.