: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేస్తుంది: ప్రకాశ్ జవదేకర్


తెలుగు రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలా పెద్దల సభలో ప్రశ్నించే నేతలు కావాలని అన్నారు. పట్టభద్రులంతా తెలంగాణ సమాజ హితం కోసం పనిచేసే వాళ్లు కావాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అవసరమైన సహాయం చేసేందుకు ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావును గెలిపించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News