: మసీదులను ఎప్పుడైనా కూల్చొచ్చు... సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు... కేసు నమోదు చేసిన పోలీసులు


నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో ఉండే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి మతసహనాన్ని భంగపర్చే కామెంట్లు వదిలారు. మసీదులంటే కేవలం నిర్మాణాలే తప్ప ప్రార్థనా మందిరాలు కావని, వాటిని ఎప్పుడైనా కూల్చివేయొచ్చని అన్నారు. ఇస్లాంను పరిపూర్ణంగా విశ్వసించే గల్ఫ్ దేశాల్లో సైతం రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదుల్ని కూలగొడతారని ఆయన గుర్తుచేశారు. ఇండియాలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉందని, ఈ విషయంపై ఎవరితోనైనాసరే చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగా, స్వామి వివాదాస్పద వ్యాఖ్యలపై ముస్లిం మైనారిటీ సంఘాలతో పాటు బీజేపీ అసోం శాఖ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సుబ్రహ్మణ్యస్వామి మరోసారి అసోం రాష్ట్రానికి రాకుండా నిషేధం విధించాలని కిసాన్ ముక్తి సంగ్రామ్ సమితి డిమాండ్ చేసింది. స్వామిపై ఐపీసీ 120 (బీ), 153 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అసోం పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News