: వెస్టిండీస్ లక్ష్యం 176 పరుగులు
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా నెపియర్ లో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ 47.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టులో జావెద్(56), నాసిర్ అజీజ్(60) అర్ధ సెంచరీలతో రాణించారు. నవీద్ 14 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ కనీసం రెండంకెల స్కోరు సాధించడంలో విఫలం అయ్యారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4, టేలర్, రసెల్ చెరో రెండేసి వికెట్లు తీశారు. మరికాసేపట్లో 176 పరుగుల విజయ లక్ష్యంతో వెస్టిండీస్ బరిలోకి దిగనుంది.