: 'ఇండియాతో ఆడితే అందరికీ అవకాశం'... సామాజిక వెబ్ సైట్లలో సందడి
'ఇండియాతో ఆడండి... ఎవరి సత్తా ఏమిటో చూపండి', 'భారత్ తో ఆడితే అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దొరుకుతుంది'... సామాజిక వెబ్ సైట్లు, వాట్స్ యాప్ లో ప్రస్తుతం సందడి చేస్తున్న వ్యాఖ్య ఇది. జింబాబ్వేను 287 పరుగులకు ఆలౌట్ చేసిన తరువాత గ్రూపు దశలో ఆడిన ఆరు మ్యాచ్ లలో గెలుపుతో పాటు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఆలౌట్ చేసిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. గ్రూప్-ఎలో న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే.