: మంత్రి గంటా శ్రీనివాసరావు కోడలినంటూ మోసం చేస్తున్న మహిళ!


ప్రజలను మోసం చేసి సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నించేవాళ్లు ఎప్పటికైనా చట్టం ముందుకు రావాల్సిందే. కాకినాడలో ఓ మహిళ కూడా ఇలానే వంచనకు తెరదీసి పోలీసులకు పట్టుబడింది. కొన్ని రోజుల క్రితం అవినాష్ అనే మోసగాడు ఉద్యోగాలిప్పిస్తానని, తాను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి చెందిన వాడినని చెప్పి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడడం తెలిసిందే. అన్నిటికంటే ముఖ్యంగా, తాను ఏపీ హోం మంత్రి చినరాజప్పకు బంధువునంటూ పెద్ద దందానే నడిపాడు. తాజాగా, పోలీసులకు చిక్కిన పీతకాయల సుజాత అనే పిఠాపురం మహిళ కూడా తాను మంత్రి గంటా శ్రీనివాసరావు కోడలినని చెప్పుకుంటూ లక్షలు గుంజిందని బాధితులు వాపోతున్నారు. మెడికల్ సీట్లు ఇప్పిస్తుందన్న ఆశతో బాధితులు ఆమెకు రూ.7 లక్షల వరకు ముట్టజెప్పారట. మరో మహిళ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని తనకు పేరుమోసిన న్యాయమూర్తులు తెలుసంటూ రూ.2 లక్షలు వసూలు చేసిందట. హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేట్టు చేస్తానంటూ ఓ తండ్రీకొడుకుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేయగా, తీర్పు వ్యతిరేకంగా రావడంతో వారు నిలదీశారట. దాంతో, వారిపైనే రేప్ కేసు పెట్టిన ఘనత ఈ పీతకాయల సుజాతదని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News