: సురేశ్ రైనాకు పెళ్లా?
వరల్డ్ కప్ లో సత్తా చాటుతున్న టీమిండియా బ్యాట్స్ మన్ సురేశ్ రైనా వివాహం త్వరలోనే జరగనుందని సమాచారం. ఘజియాబాద్ కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండర్ కు తల్లి మాటంటే వేదం. ఇంతకుముందు చాలాసార్లు, తల్లి చూసిన అమ్మాయితోనే పెళ్లి అని రైనా స్పష్టం చేశాడు కూడా. అది నిజమే అనిపించేలా... తల్లి స్నేహితురాలి కుమార్తెతోనే రైనా వివాహం జరగనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతుండడంతో, అది ముగిసిన వెంటనే రైనా ఓ ఇంటివాడయ్యే అవకాశాలున్నాయి. కాగా, రైనాతో ఇంతకుముందు ఎందరో అమ్మాయిలను ముడిపెట్టి మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. రాజకీయనేత ప్రఫుల్ పటేల్ తనయ పూర్ణా పటేల్ తోనూ, శ్రుతి హాసన్ తోనూ ఎఫైర్లున్నట్టు వార్తలొచ్చాయి.