: శ్రీలంకలో కొత్త రైలును ప్రారంభించిన మోదీ
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం తలైమన్నార్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం, తలైమన్నార్-మదు రైలును జెండా ఊపి ప్రారంభించారు. కొత్త రైలు ముందు భాగంలో భారత్, శ్రీలంక జెండాలను ఉంచారు. అనంతరం జాఫ్నా సాంస్కృతిక కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ రోజుతో ఆయన శ్రీలంక పర్యటన ముగియనుంది.