: షబ్బీర్ అలీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నా: జానారెడ్డి


తమ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఉపయోగించిన అసభ్య పదజాలాన్ని ఖండిస్తున్నానని టీ.సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అలీపై చేసిన ఆ వ్యక్తిగత వ్యాఖ్యలు ఆయన అహంకారానికి సంకేతమన్నారు. తగిన సమయంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత వారి నేతలకు హితవు చెప్పాలని జానా సూచించారు. గవర్నర్ ప్రసంగం రోజు జరిగిన గందరగోళంపై పూర్తి దృశ్యాలను చూపడం లేదని, ఈ విషయంపై స్పీకర్ కు తాను లేఖ రాశానని చెప్పారు. సస్పెన్షన్ పై టీ.టీడీపీ సభ్యులెవరూ తనవద్దకు రాలేదని, కానీ వారిని బడ్జెట్ సెషన్ మొత్తం నిషేధించడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News