: వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన సీపీఐ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అరెస్టు నేపథ్యంలో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించి, వాకౌట్ చేయడం తెలిసిందే. దీనిపై సీపీఐ స్పందించింది. ఇందుకుగానూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేత శంకర్ నారాయణ్ డిమాండ్ చేశారు. అటు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అనంతపురం జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన విషయంలో కూడా సీపీఐకి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉరవకొండలో సీపీఐ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పలుచోట్ల దూకాణాలు కూడా మూసివేయించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యా సంస్థలకు మినహాయింపునిచ్చారు.